వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టలు భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి.మే 10 వరకు అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 696 పోస్టులను భర్తీ చేస్తున్నది. 594 పోస్టులు రెగ్యులర్ బేసిస్ కాగా, 102 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఇందులో ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, రిస్క్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 696
ఇందులో ఎకనమిస్ట్ 2, స్టాటిస్టీషియన్ 2, రిస్క్ మేనేజర్ 2, క్రెడిట్ అనలిస్ట్ 53, క్రెడిట్ ఆఫీసర్ 484, టెక్ అప్రైజల్ 9, ఐటీ ఆఫీసర్ 42, ఐటీ మేనేర్ 27, ఐటీ సీనియర్ మేనేజర్ 11, సీనియర్ మేనేజర్ 10, మేనేజర్ 34 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎంబీఏ, పీజీ, బీఈ, బీటెక్, సీఏ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 26
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్‌సైట్: www.bankofindia.co.in
Subscribe My Whatsapp & Telegram Groups
I want job
ReplyDelete