Jobs Notification in Telangana: తెలంగాణలో భర్తీ చేసే పోస్టులు ఖాళీలు మొత్తం వివరాలు

Jobs Notification in Telangana: తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో (Jobs In Telangana) భాగంగా అర్హత వయసును (Age Relaxation) ప్రభుత్వం భారీగా పెంచింది.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బుధవారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు. పోలీసు శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా మిగిలిన ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. దీని వల్ల ఓసీలకు 44 ఏళ్లు, SC, ST, BCలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ఠ పరిమితపెరుగుతుందని KCR చెప్పారు.

ఈ పోస్టుల భర్తీ (Government Jobs in Telangana) ప్రక్రియ కోసం ఏటా సుమారు 7 వేల కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని చెప్పారు. అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. యువతకు ఒక స్పష్టత ఉండేలా ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calender) రూపొందిస్తామని చెప్పారు. ప్రతి విభాగంలో ఏర్పడే ఖాళీలను ఆయా శాఖలు సమర్పిస్తాయని అన్నారు. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు ఇస్తాయని అన్నారు.

''గ్రూపు 1 - 503, గ్రూపు 2 - 582, గ్రూపు 3 - 1370, గ్రూపు 4 - 9,168 పోస్టులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జోనల్ పోస్టులు 18,866 ఉద్యోగాలు, మల్టీ జోనల్ పోస్టులు 13,170 పోస్టులు, విశ్వవిద్యాలయాలు, సెక్రెటేరియల్, హెచ్ఓడీ వంటి వాటిలో 8147 ఉద్యోగాలు రానున్నాయి.'' అని కేసీఆర్ వివరించారు.

జిల్లా వారీగా ఉద్యోగాల సంఖ్య ఇదీ

* హైదరాబాద్ - 5,268
* నిజామాబాద్ - 1976
* మేడ్చల్ మల్కాజ్ గిరి - 1769
* రంగారెడ్డి - 1561
* కరీంనగర్ - 1,465
* నల్గొండ - 1,398
* కామారెడ్డి - 1,398
* ఖమ్మం - 1,340
* భద్రాద్రి - కొత్తగూడెం 1,316
* నాగర్ కర్నూల్ - 1,257

* జోనల్ స్థాయిలో - 18,866

* మల్టీ జోన్ - 13,170

* అదర్ కేటగిరి, వర్సిటీలు - 8,174

* మొత్తం పోస్టులు - 80,039 భర్తీ

శాఖల వారీగా ఖాళీలు..

హోం శాఖ- 18,334

సెకండరీ ఎడ్యుకేషన్- 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బీసీల సంక్షేమం- 4,311

రెవెన్యూ శాఖ- 3,560

ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879

నీటిపారుదల శాఖ- 2,692

ఎస్టీ వెల్ఫేర్- 2,399

మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455

లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221

ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563

న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343

ఇండస్ట్రీస్, కామర్స్- 233

యూత్, టూరిజం, కల్చర్- 184

ప్లానింగ్- 136

ఫుడ్, సివిల్ సప్లయిస్- 106

లెజిస్లేచర్- 25

ఎనర్జీ- 16
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top