ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16న Green Tech Industries Pvt Ltd సంస్థలో ఖాళీల(Jobs) భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ సంస్థలో Machine Operator విభాగంలో 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికిన నెలకు రూ.10 వేల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర వివరాలు..
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
-రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 16న VR Degree College, Nellore చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
Saitejay91@gmail.com
ReplyDelete