జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 89 ఎఫ్‌ఎన్‌వో, 30 శానిటరీ అంటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని డీఎంహెచ్‌వో శ్రీహరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో మరోసారి అవకాశమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఎన్‌వో తొమ్మిది పోస్టులుండగా ఓసీ, ఈబీసీ కేటగిరీలో 5, బీసీ-సీ కేటగిరీలో1, బీసీ-ఈలో 2, ఎస్టీలో ఒకటి ఖాళీగా ఉన్నట్లు వివరించారు. అలాగే శానిటరీ అంటెండర్ కమ్ వాచ్‌మెన్ నాలుగు పోస్టులు ఉండగా.. ఓసీ, ఈబీసీలో 2, బీసీ-సీలో 1, బీసీ-ఈలో ఓ పోస్టు ఉందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల పదో తేదీన సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు https://chittoor.ap.gov.in/notice_category/recruitment/
ను సంప్రదించాలని కోరారు.
0 comments:
Post a Comment