నిరుద్యోగులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర మంత్రిత్వ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 78
*దరఖాస్తుకు చివరి తేది: 2022 జనవరి 27
*ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్-01, అసిస్టెంట్ డైరెక్టర్ (కాస్ట్)-16, ఎకనమిక్ ఆఫీసర్-04, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-01, మెకానికల్ మెరైన్ ఇంజనీర్-01, లెక్చరర్(ఆక్యుపేషనల్ థెరపీ)-04, సైంటిస్ట్(బి)-02, కెమిస్ట్-05, జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్-36, రీసెర్చ్ ఆఫీసర్-01, అసిస్టెంట్ ప్రొఫెసర్-01 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి ఏదైనా డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ పాసై ఉండాలి.
*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
*వయోపరిమితికి సంబంధించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.upsconline.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
0 comments:
Post a Comment