ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటనను అధికారులు తాజాగా విడదుల చేశారు.MATAR Technologies Pvt Ltd సంస్థలో ఖాళీల భర్తీకి ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీలు, అర్హతల వివరాలు:
TIG Welder: ఈ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ(వెల్డింగ్) తో పాటు TIG వెల్డింగ్ పై గుర్తింపు పొందిన సంస్థ నుంచి ట్రైనింగ్ తీసుకున్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అర్హులు. 0-5 ఏళ్ల అనుభవం ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వేతనం చెల్లించనున్నారు.
Telangana Police: యువతకు తెలంగాణ పోలీసుల శుభవార్త.. ఫ్రీగా కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్.. వివరాలివే
CNG Mining Operators: ఈ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ/డిప్లొమా(మెకానికల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి CNGపై శిక్షణ పొంది ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల నుంచి రూ.25 వేల వేతనం చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
-0 నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఇతర వివరాలు: హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 30 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఇన్సూరెన్స్, ఇంక్రిమెంట్స్&ప్రమోషన్స్ ఉంటాయి. సబ్సిడీపై ఫుడ్ ఉంటుంది.
-అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment