ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. తాజాగా మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటన చేసింది APSSDC . అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ HETERO DRUGS, Sri Ranga Motors Pvt Ltd సంస్థల్లో 160 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ప్రకటనలో చూడొచ్చు.
ఖాళీల వివరాలు:
Hetero Drugs: ఈ సంస్థలో 140 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ/ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ (2019/2020/2021) చేసిన అభ్యర్థులు ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16500 వేతనం చెల్లించనున్నారు. ఇతర అలవెన్స్ లు, బోనస్ లు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Sri Ranga Motors Pvt Ltd: సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 20 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఎంపికైన వారు విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి.
ఇతర వివరాలు:
-అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-ఈ నెల 21న శ్రీ వివేకానంద డిగ్రీ&పీజీ కాలేజీ, విశాఖ-అరకు రోడ్, ఎస్.కోట(ఎమ్)-విజయనగరం జిల్లా చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment