ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా, వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం(DMHO) కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 61
*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 21
*ఇందులో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలున్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఇంటర్మీడియట్ తో పాటు రెండేళ్ల డిప్లొమా కోర్సు, బ్యాచిలర్ ఫార్మసీ పాసై ఉండాలి. ఏపీ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అలాగే సర్వీస్ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును DMHO, Guntur, AP చిరునామాకు పంపాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://guntur.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు
0 comments:
Post a Comment