భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారికి ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభవాన్నిఅందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ జాబ్ రోల్ (Job Role) లో ముఖ్యంగా వినియోగదారుల సమస్యలు వేగంగా పరిష్కరించిందేకు కృషి చేయాలి. అందుకు అనుగుణంగా ప్లానింగ్ (Planning)ను అందించాలి.
దరఖాస్తుకు అర్హతలు..
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థికి 0-2 సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి.
- అద్భుతమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామర్థ్యం అవసరం.
- వినియోగదారుల సమస్యలను ఓపికగా వినాలి.
- పనికి సంబంధించిన మేనేజమెంట్ స్కిల్స్ ఉండాలి.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అభ్యర్థులు www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి.
Step 3 : ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్‌ను పూర్తిగా చదవాలి.
Step 4 : వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.
Step 5 : అనంతరం స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 6 : అభ్యర్థి లింక్డ్‌ఇన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కెరీర్ పేజీలో అందుబాటులో ఉంది.
Step 7 : అవరసమైన వివరాలను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం దరఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌లను నింపాలి.
Step 8 : దరఖాస్తు పూర్తయిన తరువాత సబ్‌మిట్ చేయాలి.
మరిన్ని అవకాశాలు..
అంతే కాకుండా ఫోన్‌పే కంపెనీ సీనియర్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అండ్ సోషల్ మీడియా (Auto Machine Specialties and Social Media) నిపుణులను కూడా నియమిస్తోంది. రెండు పోస్టులకు దరఖాస్తులు తెరిచి ఉన్నాయి. ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Phonepeలో, ఐదు పని దినాలు ఉన్నాయి, అయితే, సంస్థ ఏ ఉద్యోగానికి అందించే జీతం వివరాలు పేర్కొనలేదు.
Online Apply: www.phonepe.com
Bhargav
ReplyDelete