ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 55 వేల మందిని నియమించుకోనున్నట్లు పేర్కొంది. అమెజాన్ భారతదేశంలో ఈ నెల 16న తొలి జాబ్ మేళాను నిర్వహించనుంది. ఆన్లైన్ విధానంలో ఈ జాబ్ మేళా జరగనుంది.
ఇండియాలోని 35 నగరాల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నగరాల్లో హైదరాబాద్, చెన్నై, ముంబై, గుర్ గావ్, కోలకతా, నోయిడా, అహ్మదాబాద్, అమృత్సర్, భోపాల్, కోయంబత్తూర్, జైపూర్, కాన్పూర్, లుధియానా, పూణే, సూరత్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీస్, టెక్నాలజీ, ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ సహా పలు విభాగాల్లోని ఖాళీలను కంపెనీ భర్తీ చేయనుంది.
0 comments:
Post a Comment