ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
▪️అప్లికేషన్లకు సెప్టెంబర్ 03ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
▪️మొత్తం 347 ఖాళీలలను భర్తీ చేస్తున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
సీనియర్ మేనేజర్(రిస్క్)-60 పోస్టులు
మేనేజర్(రిస్క్)-60 పోస్టులు
మేనేజర్(సివిల్ ఇంజనీర్)-7 పోస్టులు
మేనేజర్ (ఆర్కిటెక్ట్) - 7 పోస్టులు
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజర్) - 2 పోస్టులు
మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) - 1 పోస్ట్
మేనేజర్ (Forex) - 50 పోస్టులు
మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్) - 14 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) - 26 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (Forex) - 120 పోస్టులు
▪️సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20-30 ఏళ్లు ఉండాలి.
ఆన్లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే సమయంలో అభ్యయర్థులు రూ. 850 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWBD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
Official Website - unionbankofindia.co.in
I like this job
ReplyDelete