UGC NET 2021 : యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది...ఒకేసారి రెండు పరీక్షలు

UGC NET 2021 : యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది...ఒకేసారి రెండు పరీక్షలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA 2020 డిసెంబర్ సెషన్, 2021 జూన్ సెషన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది.

 యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సైకిల్ రెగ్యులరైజే చేసేందుకు 2020 డిసెంబర్ సెషన్, 2021 జూన్ సెషన్ పరీక్షల్ని కలిపి నిర్వహించాలని నిర్ణయించాం" అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ప్రకటించింది

ఇప్పటికే 2020 డిసెంబర్ సెషన్ దరఖాస్తుల్ని స్వీకరించింది కాబట్టి, 2021 జూన్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభించింది.

అభ్యర్థులు
లేదా
 వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు.

UGC NET 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 10

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 5 రాత్రి 11.50 గంటలు

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 6 రాత్రి 11.50 గంటలు

దరఖాస్తులు సరిదిద్దుకోవడానికి అవకాశం- 2021 సెప్టెంబర్ 7 నుంచి 12

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- తేదీ త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

పరీక్ష తేదీ- 2021 అక్టోబర్ 6 నుంచి 11

ఫస్ట్ షిఫ్ట్- ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు

సెకండ్ షిఫ్ట్- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

విద్యార్హతలు- ఏదైనా సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.

వయస్సు- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం 2021 అక్టోబర్ 1 నాటికి 31 ఏళ్లు దాటకూడదు. ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్, మహిళలకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఏజ్ లిమిట్ ప్రస్తుత ఎగ్జామ్‌కు మాత్రమే.

 అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం గరిష్ట వయో పరిమితి లేదు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top