ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150కిపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
మొత్తం పోస్టులు: 155
ఇందులో ఎంటీఎస్ 64, ట్యాక్స్ అసిస్టెంట్ 83, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంటీఎస్ పోస్టుకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో, యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లు, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జట్టులో సభ్యుడై జాతీయ క్రీడల్లో ఏదో ఒకటి పాల్గొని ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నవారై ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత అవసరమైతే ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: incometaxmumbai.gov.in
Subscribe My Whatsapp & Telegram Groups
Redpected sir,
ReplyDeleteNCC holders also eligible for this notification..?