మంచి జీతం, అలవెన్సులతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాల్లో నేవీ పోస్టులు ముఖ్యమైనవి. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్, యాంత్రిక్ పోస్టుల కోసం ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2021 జులై 2 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై రెండు తరువాతే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందుకు అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డు అధికారిక వెబ్ సైట్ https://joinindiancoastguard.cdac.in/ సందర్శించాలి. మొత్తం 350 పోస్టుల కోసం నియామకాలు జరగనున్నాయి. భారత కోస్ట్ గార్డు పోస్టులకు జులై 2 నుంచి దరఖాస్తులు ప్రారంభవుతాయి. అప్లికేషన్ కు ఆఖరు తేదీ జులై 16 వరకు ఉంటుంది. అర్హత కలిగిన విద్యార్థులు నోటిఫికేషన్ చూసి అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
Coast Guard Recruitment 2021: ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు- 350
నావిక్ (జనరల్ డ్యూటీ)- 260 పోస్టులు
నావిక్ (డోమెస్టిక్ బ్రాంచ్)- 50 పోస్టులు
యాంత్రిక్ (మెకానికల్)- 20 పోస్టులు
యాంత్రిక్ (ఎలక్ట్రికల్)- 13 పోస్టులు
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)- 7 పోస్టులు
Coast Guard Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హత- నావిక్ పోస్టుల కోసం 10+2 విద్యార్హతతో మ్యాథ్స్, ఫిజిక్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) చదివి ఉండాలి. యాంత్రిక్ పోస్టుల కోసం COBSE నుంచి 10వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. దీంతో పాటు ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) ద్వారా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యునికేషన్స్(రేడియోపవర్) ఇంజినీరింగ్ లో 3 నుంచి 4 ఏళ్ల కాల వ్యవధిలో పూర్తి చేసిన డిప్లోమాను కలిగి ఉండాలి.
వయస్సు- అభ్యర్థుల కనీస వయస్సు 18 నుంచి 22 మధ్య ఉండాలి.
ఎంపిక విధానం- ఈ పరీక్ష ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది. స్టేజ్-1, 2, 3, 4లో ప్రదర్శన ఆధారంగా ఆల్ ఇండియా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. అంతేకాకుండా ఖాళీల ప్రకారం మెరిట్ ఉన్నవారిని తీసుకుంటారు.
అప్లికేషన్ ఫీజు- SC, ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారు అప్లికేషన్ ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ మోడ్ లేదా నెట్ బ్యాంకింగ్, వీసా/మాస్టర్/మ్యాస్ట్రో/రూపే క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/యూపీఐ రూపంలో ఫీజుల చెల్లించాలి.
ఉద్యోగ నోటిఫికేషన్స్ సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/FTlnTMoAOKK4jeTdP6EubP
Official Website: https://joinindiancoastguard.cdac.in/
0 comments:
Post a Comment