బ్యాంక్ నోట్ ప్రెస్ (బీఎన్‌పీ) నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ 135 ఉద్యోగ ఖాళీల కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయిఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 11వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నోయిడాలోని ఇండియా గవర్నమెంట్ మింట్‌లోని ఉద్యోగ ఖాళీల భర్తీ కూడ జరగనుంది. http://bnpdewas.spmcil.com/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మొత్తం 135 ఉద్యోగ ఖాళీలలో జూనియర్ టెక్నీషియన్ 113, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 15, సూపర్‌వైజర్ 2, వెల్ఫేర్ ఆఫీసర్ 1 ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్టెనోగ్రఫీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి.
సూపర్ వైజర్ పోస్టులకు డిప్లొమా, మిగిలిన పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH6UH8wzmRQIV40nXHXsrQ
0 comments:
Post a Comment