ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 103 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండీమ్యాన్ లేదా లోడర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
BECIL Recruitment 2021:బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
మొత్తం పోస్టులు: 103
ఇందులో సూపర్‌వైజర్ 26, సీనియర్ సూపర్‌వైజర్ 4, లోడర్ 73 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: లోడర్ పోస్టులకు 8వ తరగతి పాసై, స్థానిక భాష, హిందీ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి
మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తిచేయాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.450
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
ఉద్యోగ నోటిఫికేషన్స్ సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/FTlnTMoAOKK4jeTdP6EubP
వెబ్‌సైట్: www.becil.com
0 comments:
Post a Comment