Muthoot Finance: ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో నియామకాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో మొత్తం 30 ఖాళీలను భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. JRE(జూనియర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్), ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్ లైన్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు

.గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14 వేల వేతనంతో పాటు వెహికిల్ అలవెన్స్ అందించనున్నారు.

ఈ విభాగంలో మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఎంబీఏ లేదా ఎంఏ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. 2019/20/21 లో పాసై ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.30 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. 

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా జూన్ 2 వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. తద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ - కృష్ణా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు 9652518187 నంబరును సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.



Posted in:

Related Posts

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. 전국의 마사지샵(구인 업체)과 마사지 구직자(관리사)를 연결하는 전문 플랫폼의 등장으로, 이제 마사지구인 정보를 찾거나 인재를 모집하는 과정이 한층 수월해졌습니다 마사지구인

    ReplyDelete

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top