ESIC Recruitment 2021: ఇంటర్ డిగ్రీ అర్హతతో భారీ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్@6552 పోస్ట్లు



 ESIC Recruitment 2021: గత కొన్ని రోజులుగా వరసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ.. నిరుద్యోగులకు ఊరటనిస్తోంది. తాజాగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 6552 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మొత్తం ఖాళీల్లో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ క్యాషియర్‌ పోస్టులు 6,306 ఉన్నాయి. ఇక 246 పోస్టులు స్టెనోగ్రాఫర్‌ కు ఉన్నాయని సమాచారం. స్టెనోగ్రఫీ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. మిగిలిన వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.esic.nic.in/recruitments ను సందర్శించవచ్చు.

ఇక అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌/అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ క్యాషియర్‌ ఉద్యోగ ఖాళీలకు మాత్రం ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ముఖ్యంగా డేటాబేస్‌, ఆఫీస్‌ వంటి అంశాలపై కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయసు: 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.ముఖ్యంగా 10 నిమిషాల్లో నిమిషానికి 80 పదాలు టైప్‌ చేయగలిగే సామర్థ్యం ఉంటే ఈ ఉద్యోగాలకు ఈజీగా ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అయితే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top