సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి ?

సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల విష‌యంలో ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ రెండు బిల్లుల‌ను శాస‌న‌మండ‌లి సెలెక్ట్ క‌మిటీకి పంపించింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం కాకుండా త‌న విచ‌క్ష‌ణా అధికారాల‌ను ఉప‌యోగించి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ష‌రీఫ్ ఈ రెండు బిల్లుల‌ను సెలెక్ట్ క‌మిటీకి పంపించారు. సెలెక్ట్ క‌మిటీకి ఈ బిల్లుల‌ను పంపించ‌డం ద్వారా మూడు రాజ‌ధానుల ఏర్పాటు మూడు నెల‌ల పాటు ఆల‌స్యం కానుంది.

●సెలక్ట్ క‌మిటీ అంటే శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌తో కూడిన ఒక క‌మిటీ. 10 నుంచి 15 మంది లోపు ఎమ్మెల్సీల‌తో ఈ క‌మిటీని ఏర్పాటు చేస్తారు. శాన‌స‌మండ‌లిలో పార్టీల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి క‌మిటీలో ప్రాతినిథ్యం క‌ల్పిస్తారు.సెలెక్ట్ క‌మిటీ ఛైర్మ‌న్‌ను శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ నియ‌మిస్తారు.

●సెలక్ట్ కమిటీకి బిల్లును తిరస్కరించే అధికారం లేకపోయినా ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశం ఉంది.  సెలక్ట్ కమిటీలో మండలిలో సంఖ్యాబలం ప్రకారమే సభ్యులుంటారు. మెజార్టీ సభ్యులున్న టీడీపీ నుంచే ఎక్కువ మంది సభ్యులుంటారు. వైసీపీకి తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు కాబట్టి వారికి సెలక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం కూడా తక్కువగానే ఉంటుంది. సెలక్ట్ కమిటీకి పంపాలని అడిగిన టీడీపీ సభ్యుడ్నే కమిటీ ఛైర్మన్ గా కూడా నియమించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

●ఈ బిల్లులు రాష్ట్రం మొత్తానికి సంబంధించినవి కావ‌డంతో మొత్తం 13 జిల్లాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సెలెక్ట్ క‌మిటీ తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అంద‌రి అభిప్రాయాల‌ను బేరీజు వెసుకొని బిల్లుల‌లో స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించే అధికారం మాత్ర‌మే సెలెక్ట్ క‌మిటీకి అంటుంది.

●సెలెక్ట్ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌తో బిల్లు మ‌రోసారి అసెంబ్లీకి వ‌స్తుంది.అసెంబ్లీలో సెలెక్ట్ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చించి అవ‌స‌ర‌మైతే బిల్లుల‌లో మార్పులు చేసి మ‌ళ్లీ శాస‌న‌మండ‌లికి పంపిస్తారు. ఈ సారి శాస‌న‌మండ‌లిలో బిల్లులు ఆమోదం పొందితే ఏ స‌మ‌స్యా ఉండ‌దు.
 
●ఒక‌వేళ శాస‌న‌మండ‌లిలో బిల్లులు తిర‌స్క‌ర‌ణ‌కు గురైతే మ‌రోసారి బిల్లుల‌ను అసెంబ్లీలో పెట్టి ఆమోదిస్తారు. ఈసారి శాస‌న‌మండ‌లికి పంపించాల్సిన అవ‌స‌రం లేకుండా బిల్లులు ఆమోదం పొందిన‌ట్లు అవుతుంది. అంటే సెలెక్ట్ క‌మిటీకి ఈ బిల్లులు పంపించ‌డం ద్వారా మూడు రాజ‌ధానులు ఏర్ప‌డ‌కుండా తాత్కాలికంగా వాయిదా వేయ‌డం మిన‌హా పూర్తిగా ఆపే అవ‌కాశం మాత్రం లేదు.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top