IGI : ఇంటర్‌ అర్హతతో 1,074 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ.35,000 వరకూ జీతం

IGI Aviation Recruitment 2024 : న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు మే 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య సమాచారం :

ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు: 1,074

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000గా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

పరీక్ష ఫీజు: రూ.350గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2024


Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top