AP Postal GDS 2nd Selection List
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 06 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment