EPFO Recruitment 2023: ఈపీఎఫ్ఓలో 577 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో (EPFO) పలు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) షార్ట్ నోటీస్ విడుదల చేసింది. ఈపీఎఫ్ఓలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 577 ఖాళీలున్నాయి. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు 418 ఉండగా, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ పోస్టులు 159 ఉన్నాయి. ఈ పోస్టులకు 2023 ఫిబ్రవరి 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2023 మార్చి 17 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
EPFO Recruitment 2023: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు 577

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ 418

అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ 159


EPFO Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2023 ఫిబ్రవరి 25

దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 17

అడ్మిట్ కార్డుల విడుదల- ప్రకటించాల్సి ఉంది

పరీక్ష తేదీ- ప్రకటించాల్సి ఉంది

EPFO Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. పూర్తి అర్హతల్ని డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది యూపీఎస్‌సీ .

వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు 35 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.

EPFO Recruitment 2023: అప్లై చేయండి ఇలా...

Step 1- అభ్యర్థులు ముందుగా యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

Step 3- వేర్వేరు పోస్టులకు అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

Step 4- అభ్యర్థి ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 5- New Registration పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.

Step 7- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Online Application Link


వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top