TS High Court Jobs 2023: ఏడు నుంచి పదో తరగతి పాసైన వారికి తెలంగాణ హైకోర్టులో 1226 ఉద్యోగాలు.. నెలకు రూ.58 వేల జీతం..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసు కింద వివిద జిల్లా కోర్టుల్లో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏడో తరగతి నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. స్థానిక భాషపై పట్టు ఉండటంతోపాటు సంబంధిత స్కిల్స్‌ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 11 నుంచి ప్రారంభమవుతాయి. ఓసీ, బీసీ అభ్యర్ధులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.400లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,000ల నుంచి రూ.58,850ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీలు: 10
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీలు: 19
కోర్ట్ ఆఫ్‌ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్‌, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 36
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 125
సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 26
హనుమకొండ జిల్లాలో ఖాళీలు: 19
జగిత్యాల జిల్లాలో ఖాళీలు: 32
జనగామ జిల్లాలో ఖాళీలు: 13
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీలు: 18
జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీలు: 25
కామారెడ్డి జిల్లాలో ఖాళీలు: 14
కరీంనగర్ జిల్లాలో ఖాళీలు: 12
ఖమ్మం జిల్లాలో ఖాళీలు: 13
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖాళీలు: 11
మహబూబాబాద్ జిల్లాలో ఖాళీలు: 13
మంచిర్యాల జిల్లాలో ఖాళీలు: 14
మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీలు: 33
మెదక్ జిల్లాలో ఖాళీలు: 16
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఖాళీలు: 92
మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 128
ములుగు జిల్లాలో ఖాళీలు: 14
నాగర్ కర్నూలు జిల్లాలో ఖాళీలు: 28
నల్గొండ జిల్లాలో ఖాళీలు: 55
నారాయణపేట జిల్లాలో ఖాళీలు: 11
నిర్మల్ జిల్లాలో ఖాళీలు: 18
నిజామాబాద్ జిల్లాలో ఖాళీలు: 20
పెద్దపల్లి జిల్లాలో ఖాళీలు: 41
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీలు: 26
రంగారెడ్డి జిల్లాలో ఖాళీలు: 150
సంగారెడ్డి జిల్లాలో ఖాళీలు: 30
సిద్దిపేట జిల్లాలో ఖాళీలు: 25
సూర్యాపేట జిల్లాలో ఖాళీలు: 38
వికారాబాద్ జిల్లాలో ఖాళీలు: 27
వనపర్తి జిల్లాలో ఖాళీలు: 19
వరంగల్ జిల్లాలో ఖాళీలు: 21
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీలు: 34

జీత భత్యాలు: నెలకు రూ.19,000 - రూ.58,850

ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 35, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 15 
ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

దరఖాస్తు రుసుం: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 15-02-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top