Technical Jobs: బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారా.. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ & రీసెర్చ్(Society for Applied Microwave Electronics Engineering & Research) సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.sameer.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి జనవరి 28, 2023 చివరి తేదీగా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్/పోస్ట్ (ఆఫ్‌లైన్) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య 35. విభాగాల వారీగా ఖాళీలు ఇలా..

1. రీసెర్చ్ సైంటిస్ట్- 19 

2. ప్రాజెక్ట్ అసిస్టెంట్-4 

3. ప్రాజెక్ట్ అసిస్టెంట్(A)- 8 

4. ప్రాజెక్ట్ టెక్నీషియన్- 1 

5. ప్రాజెక్ట్ టెక్నీషియన్(A)- 3 

అర్హతలు..

రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తలు చేసుకునే అభ్యర్థులు- BE లేదా B.Tech, ME లేదా M.Techలో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 

ప్రాజెక్ట్ అసిస్టెంట్- డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేయాలి. 

ప్రాజెక్ట్ అసిస్టెంట్(A)- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నీషియన్(A), ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. 

వయో పరిమితి..

రీసెర్చ్ సైంటిస్ట్- 30 సంవత్సరాలు 

ప్రాజెక్ట్ అసిస్టెంట్- 25 సంవత్సరాలు 

ప్రాజెక్ట్ అసిస్టెంట్(A)- 25 సంవత్సరాలు 

ప్రాజెక్ట్ టెక్నీషియన్- 25 సంవత్సరాలు 

ప్రాజెక్ట్ టెక్నీషియన్(A)- 25 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

జీతం:

రీసెర్చ్ సైంటిస్ట్- నెలకు రూ. 30,000 

ప్రాజెక్ట్ అసిస్టెంట్- నెలకు రూ. 17,000 

ప్రాజెక్ట్ అసిస్టెంట్(A)- నెలకు రూ. 17,000 

ప్రాజెక్ట్ టెక్నీషియన్ రూ. 15,100 

ప్రాజెక్ట్ టెక్నీషియన్(A)- నెలకు రూ. 15,100 

అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. అవసరమైన విద్యార్హత సర్టిఫికేట్లను అప్లికేషన్ ఫారమ్ కు జత చేసి హెడ్ ​​అకౌంట్స్ & అడ్మినిస్ట్రేషన్, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ప్లాట్ - L2, బ్లాక్ - GP, సెక్టార్ - V, సాల్ట్ లేక్ ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్, కోల్‌కతా - 700091 అడ్రస్ కు పంపించాలి. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 9, 2023 

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జనవరి 28, 2023 

అభ్యర్థులు మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 033 2357 4875/4894 కు కాల్ చేయవచ్చు.

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి :https://chat.whatsapp.com/BaRIs4dBlJ19DVYqCZKLsk
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి:

Vacancies Details


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top