APPSC Group 2 Notification 2023 : త్వరలో APPSC Group 2 నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల సంఖ్య, పరీక్ష విధానంలో మార్పులివే

APPSC Group 2 Notification 2023 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 182 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతో ఇందులో డిప్యూటీ తహసీల్దార్‌–30, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2–16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌–15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3–05, ఏఎల్‌వో (లేబర్‌)–10, ఏఎస్‌వో (లా)–02, ఏఎస్‌వో(లేజిస్లేచర్‌)–04, ఏఎస్‌వో(సాధారణ పరిపాలన)–50, జూనియర్‌ అసిస్టెంట్స్‌(సీసీఎస్‌)–05, సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–10, జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–20, సీనియర్‌ అడిటర్‌(స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)–05, ఆడిటర్‌ (పే అండ్‌ అలవెన్స్‌ డిపార్ట్‌మెంట్‌)–10 తదితర పోస్టులు ఉన్నాయి. త్వరలో వెలువడే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

పరీక్ష విధానంలో మార్పులు:
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రూప్‌–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్‌–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని 2 పేపర్లకు కుదించింది. ఈ మేరకు జ‌న‌వ‌రి 6వ తేదీన (శుక్రవారం) జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రభు­త్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమో­దిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసారి నుంచి ఈ విధానంలోనే గ్రూప్‌ -2 పరీక్ష:
గతంలో గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్‌లో పేపర్‌–1గా ఉన్న జనరల్‌ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్‌ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్‌ సిలబస్‌ అంశాల్లోనూ మార్పులు చేశారు

తాజా ఉత్తర్వుల ప్రకారం.. గ్రూప్‌–2 పరీక్ష, సిలబస్‌ మార్పులు ఇవే:
స్క్రీనింగ్‌ టెస్ట్‌:
జనరల్‌ స్టడీస్‌ – మెంటల్‌ ఎబిలిటీ : 150 మార్కులు
మెయిన్‌ పరీక్షలు పేపర్‌–1: (150మార్కులు)
1. సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు)
2. జనరల్‌ ఓవర్‌ వ్యూ ఆఫ్‌ ద ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌

మెయిన్‌ పరీక్షలు పేపర్‌–2: (150మార్కులు)
1. ఇండియన్‌ ఎకానమీ అండ్‌ ఏపీ ఎకానమీ
2. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/GTiHh2C7QmV4LYcdKOVz3s

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top