KVS Exam Update: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.. అయితే ఈ మాక్ టెస్టు మీ కోసమే..

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది.
ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో(Online) దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 26. అంటే నేటితో ఈ దరఖాస్తుల గడువు ముగిసింది. 

అయితే తాజాగా దీనికి సంబంధించి మాక్ టెస్ట్‌లను కేంద్రీయ విద్యాలయ సంగతన్ అందుబాటులోకి తెచ్చింది. కేవీల్లో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ రూల్ నంబర్, పాస్ వర్డ్, పిన్ నంబర్లు మాక్ టెస్టు రాసే సమయంలో డిస్ల్పే అవుతాయి. వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్టులో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న సిలబస్ ఆధారంగానే పరీక్ష విధానం ఉండనుంది. ప్రధాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మాక్ టెస్టులు రాయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాని కోసమే.. అభ్యర్థులకు ఈ వెసులుబాటును కల్పించారు. కేవీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ మాక్ టెస్టు రాసుకోవాలని సూచించారు. మాక్ టెస్టు కొరకు డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి. 


ఇక విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రిన్సిపల్- 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్- 203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-1409 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)- 3176 పోస్టులు, ప్రైమరీ టీచర్(పీఆర్‌టీ)-6414, లైబ్రేరియన్- 355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్- 52 పోస్టులు, పీఆర్‌టీ(మ్యూజిక్‌)- 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్- 06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)- 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో)-156 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్‌- 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(యూడీసీ)- 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్‌డీసీ)- 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు

మాక్ టెస్టు రాయాలనుకునే అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

-ఓపెన్ అయిన వెబ్ సైట్ లో మాక్ టెస్టు కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. తర్వాత రూల్ నంబర్, పాస్ వర్డ్, పిన్ నంబర్ డిస్ల్పే అవుతాయి. 

-తర్వాత రూల్ నంబర్, పాస్ వర్డ్, పిన్ నంబర్ ఎంటర్ చేసి.. మీ పరీక్ష మొదలు పెట్టొచ్చు.

వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:

https://chat.whatsapp.com/JsTuEfIY6B70GU7z1dq081

Telegram Job Notification Link:

https://t.me/apjobs9



KVS Recruitent Mock Test Link 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top