Download Admit Card for CTET Dec22 (Available from 12 A.M. 26/12/2022)

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబరు-2022 పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) డిసెంబరు 26న విడుదల చేసింది

హాల్టికెట్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్టికెట్ పొందవచ్చు.

CTET అడ్మిట్ కార్డ్ 2022 డైరెక్ట్ లింక్

సీబీఎస్ఈ డిసెంబరు 20నే అభ్యర్థులకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ (ప్రీ-అడ్మిట్ కార్డ్) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. అభ్యర్థులు పరీక్ష రోజున అడ్మిట్ కార్డును మర్చిపోకూడదు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడం మంచింది. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 28, 29 తేదీల్లో సీటెట్ (డిసెంబరు)-2022 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ ఏడాది సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.59 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తం 74 నగరాల్లోని 243 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top