TCS BPS Hiring Drive 2022: టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..TCS BPS Hiring 2022: ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా.. ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ మేరకు టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022
అర్హత: 2020 /2021/2022 విద్యా సంవత్సరాలకు చెందిన బీకామ్/ బీఏ/ బీఏఎఫ్/ బీబీఐ/ బీబీఏ/ బీబీఎం/ బీఎంఎస్/ బీఎస్సీ/ బీసీఏ/ బీసీఎస్/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులు.
అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. పార్ట్ టైమ్ / కరస్పాండెన్స్ కోర్సులు చేసినవారు అనర్హులు.
వయసు: అభ్యర్థులు 18-28 ఏళ్లు వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం:
పరీక్ష వ్యవధి 65 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 80 మార్కులకు ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు 20 నిమిషాలు.. వెర్బల్ ఎబిలిటీ నుంచి 24 ప్రశ్నలు 26 నిమిషాలు.. రీజనింగ్ ఎబిలిటీకి 30 ప్రశ్నలు 25 నిమిషాలు కేటాయిస్తారు. ఈ నిర్ణీత సమయంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది.
Subscribe My Whatsapp & Telegram Groups
I'm looking for a job
ReplyDelete