Telangana Jobs: తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైన వాళ్లుఅర్హులు

Telangana Jobs: తెలంగాణ (Telangana)
రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (Telangana State Cooperative Apex Bank Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ స్కేల్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://tscab.org/apex -bank/ చూడొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ సెప్టెంబర్ 28న ఓపెన్ అవుతుంది.

TSCAB 2022 - మొత్తం ఖాళీలు: 40 స్టాఫ్ అసిస్టెంట్- 13

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. తెలుగుపై పట్టు ఉండాలి. రూ. 17,900 నుంచి రూ.47,920 ఉంటుంది.

మేనేజర్ స్కేల్ 1- 27

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. తెలుగుపై పట్టు ఉండాలి. రూ. 26,080 నుంచి రూ.57,800
ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2022 

దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 16, 2022

Important Links:


పూర్తి నోటిఫికేషన్:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top