Scholarship: ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు రూ.75 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు చేయండిలా..

ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ సప్లయర్ కంపెనీ షాఫ్ఫ్లర్ ఇండియా (Schaeffler India) ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. వారి కోసం ఆకర్షణీయమైన హోప్ ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఇంజనీరింగ్ విద్యార్థులకు కోసం ఈ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న ప్రారంభం కాగా... సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.

గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌ను Buddy4Study అమలు చేస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5,00,000 కంటే తక్కువ ఉన్నవారు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే Schaeffler India లేదా Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హులు కారు. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫలితాలు అక్టోబర్‌లో వెల్లడిస్తారు

* H.O.P.E ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్‌కి ఉండాల్సిన అర్హతలు

దరఖాస్తుదారులు 2021-22 అకడమిక్ సెషన్‌లో సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతిలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం లేదా UGC గుర్తింపు పొందిన కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరంలో చదువుతుండాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, మెటలర్జీ, IT, మెకానికల్, ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు ప్రాధాన్యత ఇస్తారు.

* కావాల్సిన డాక్యుమెంట్

పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఇన్‌కమ్‌ ప్రూఫ్, బ్యాంక్ పాస్ బుక్, 10వ తరగతి మార్కుషీట్, 12వ తరగతి మార్కుషీట్, అడ్మిషన్ లెటర్, లేటెస్ట్ కాలేజ్ ఫీజు రసీదు తప్పకుండా సబ్మిట్ చేయాలి.

* ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్ 1: H.O.P.E ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం సృష్టించబడిన Buddy4Study అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Apply Now’ బటన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 2: మీ రిజిస్టర్డ్ IDతో Buddy4Studyకి లాగిన్ చేసి, ‘Application Form Page’లోకి ఎంటర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయని వారు ఈమెయిల్/మొబైల్/Gmail అడ్రస్‌తో Buddy4Studyలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

స్టెప్ 3: తర్వాత ‘Schaeffler India Hope Engineering Scholarship’ అప్లికేషన్ ఫారమ్ పేజీకి ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4: దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి ‘స్టార్ట్ అప్లికేషన్’ బటన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 5: దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.

స్టెప్ 6: సంబంధిత డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి.

స్టెప్ 7: ‘Terms, Conditions’ అంగీకరించి, ‘ప్రివ్యూ’పై క్లిక్ చేయాలి.

స్టెప్ 8: ఫిల్ చేసిన వివరాలన్నీ ప్రివ్యూ స్క్రీన్‌పై సరిచూసుకొని ‘Submit’ బటన్‌పై నొక్కాలి.

* సెలక్షన్ ప్రాసెస్‌

ఈ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో పూర్తి చేసిన దరఖాస్తుల ఆధారంగా దరఖాస్తుదారుల ఇనీషియల్‌ షార్ట్‌లిస్ట్ తయారుచేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. ఫైనల్ సెలక్షన్‌లో 10-15 నిమిషాలు పాటు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు. Schaeffler India భవిష్యత్తులో సెలక్షన్ ప్రాసెస్‌లో మరిన్ని దశలు యాడ్ చేయవచ్చు.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన వారు ఈ క్రింది వాట్స్ అప్ గ్రూప్లో చేరండి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top