మీరు ఇంకా ఈ పోస్టులకు దరఖాస్తు చేయలేదా అయితే ఇప్పుడే చేయండి మంచి జీతంతో కూడిన పోస్టులు

ఉద్యోగ(Jobs) వేటలో ఉన్నవారికి గుడ్ న్యూస్. పలు సంస్థలు వివిధ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాయి.పోస్టులను బట్టి అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ వారం అప్లై చేయాల్సిన ఉద్యోగాల జాబితాను పరిశీలిద్దాం.

సెయిల్ రిక్రూట్‌మెంట్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) వివిధ విభాగాల్లోని ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ igh.sailrsp.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 200 పోస్టులను సెయిల్ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 20. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15000 జీతం లభిస్తుంది. ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం రూర్కెలాలోని ఇస్పాత్ జనరల్ హాస్పిటల్‌కు అభ్యర్థులను కేటాయిస్తారు. కంపెనీ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక మెడికల్ ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుంది.

ఐబీపీఎస్ పీవో రిక్రూట్‌మెంట్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 6,432 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో నిర్వహించాల్సి ఉంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించి నవంబర్‌లో ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత అదే నెలలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్‌లో ఫలితాలు వెలువడనున్నాయి. మెయిన్‌లో అర్హత సాధించిన వారు జనవరి/ఫిబ్రవరిలో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. తాత్కాలిక కేటాయింపుల జాబితాను ఏప్రిల్‌లో ప్రకటిస్తారు.

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్

త్రివిధ దళాలు ఆర్మీ(Army), నేవీ(Navy), ఎయిర్ ఫోర్స్.. అగ్నిపథ్(Agni Path) పథకం కింద రిక్రూట్‌మెంట్ చేపట్టాయి. నేవీలో ఇప్పటికే 82వేల మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్మీ భర్తీ చేయనున్న 25వేల పోస్టుల భర్తీకి 17.17 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఎయిర్ ఫోర్స్ నియామక ప్రక్రియలో 3వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే 7.69 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నేవీకి మొత్తం 9.55 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 82,200 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

కాగా, గతంలో నేవీ మహిళల రిక్రూట్‌మెంట్ చేపట్టలేదు. తాజాగా అగ్నిపథ్ పథకం ప్రారంభమైన తరువాత నేవీ కమ్యూనికేషన్ (ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్), సీమాన్ (అండర్‌వాటర్ సెన్సార్) సహా అన్ని విభాగాల్లో మహిళా అగ్నివీర్‌లను రిక్రూట్ చేసుకోనుంది.

యూపీపీసీఎల్ రిక్రూట్‌మెంట్

ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPPCL) ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు upenergy.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12గా నిర్ణయించారు. మొత్తం 1033 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. మొత్తం ఖాళీల్లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరిలో 416, ఎస్సీ కేటగిరిలో 216, ఎస్టీ 20, ఓబీసీకి 278, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలో 103 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top