SSC Head Constable Jobs 2022: నేటితో ముగుస్తున్న ఎస్సెస్సీ 835 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ..

SSC Delhi Police Head Constable Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్‌ 2022 కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు.అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే అర్హత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్ధులను హెడ్‌ కానిస్టేబుల్‌ (Ministerial Head Constable) పోస్టులకు ఎంపికవుతారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం క్లుప్తంగా మీకోసం..
వివరాలు:

మొత్తం పోస్టులు: 835

పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)

ఖాళీల వివరాలు:

హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌-పురుషులు) పోస్టులు: 559
హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌-మహిళలు) పోస్టులు: 276
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు 25,500ల నుంచి 81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంటర్మీడియట్‌ (10+2) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌ లేదా హిందీ టైపింగ్‌ స్పీడ్‌ వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT), ఫిజికల్‌ టెస్ట్స్‌, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 90 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే ఉంటుంది.

విభాగాల వారీగా ప్రశ్నలు:

జనరల్‌ అవేర్‌నెస్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
ఇంగ్లిష్‌ లంగ్వేజ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్థులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 16, 2022 (అర్థ రాత్రి 23:00 గంటల వరకు)

రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌, 2022.
వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్ లో కావలసిన వారు వాట్సాప్ గ్రూప్ లో చేరండి



పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి. https://ssc.nic.in లేదా https://delhipolice.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top