TCS Recruitment 2022 | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగాలు

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఏడాదికి 7 లక్షల వేతనంతో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైందిటీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. 6 నెలల నుంచి ఏడాది అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
గతంలో టీసీఎస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ కు హాజరైన అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2019, 2020, 2021 సంవత్సరాలలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లకు ఏడాదికి 7 లక్షల రూపాయలు, పీజీ చేసిన వాళ్లకు ఏడాదికి 7,30,000 రూపాయలు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. https://nextstep.tcs.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే సబ్మిట్ చేయవచ్చు. https://www.tcs.com/careers/tcs-off-campus-hiring వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top