Railway Recruitment:పదో తరగతి, ITI అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

 భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( డిఎఫ్‌సిసిఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1074 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://dfccil.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.


Railway Recruitment:పదో తరగతి, ITI అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు:

విద్యార్హతలు:

1. జూనియర్ మేనేజర్: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అలాగే ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

2. ఎగ్జిక్యూటివ్: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పవర్ సప్లయ్‌/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్: టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 23 జులై 2021

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష తేది: 2021- సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో నిర్వహించనున్నారు.

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH6UH8wzmRQIV40nXHXsrQ

అధికారిక వెబ్‌సైట్‌: https://dfccil.com/

Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top