Indian Army Recruitment: ఆర్మీ లో అవకాశాలు

దేశవ్యాప్తంగా 6 ప్రాంతాల్లో (ఆంబాలా, లక్నవూ, జబల్‌పూర్, బెల్గాం, షిల్లాంగ్, పుణే) రిక్రూట్ మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల వారీ ఎవరు ఏ ప్రాంతంలో ర్యాలీకి హాజరు కావాలో నిర్ణయిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి వీటిని బెల్గాంలో నిర్వహిస్తారు. ర్యాలీ కేంద్రాల్లో ఫిజికల్, మెడికల్, రాత పరీక్షలు నిర్వహించి ఆయా కేంద్రాలవారీ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ర్యాలీ కేంద్రానికి అడ్మిట్కా ర్డు, ఫొటోలు, సంబంధిత సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలి.

Indian Army Recruitment: ఆర్మీ లో అవకాశాలు 

ఎంపిక విధానం:

వచ్చిన దరఖాస్తులను ఖాళీలకు అనుగుణంగా పదో తరగతిలో సాధించిన మార్కుల ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో నిలిచినవారికి సంబంధిత కేంద్రంలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. అందులోనూ అర్హత సాధిస్తే వైద్య పరీక్షలు చేస్తారు. ఈ దశలో అర్హులైన వారికే రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ప్రాథమిక స్థాయి గణితం, సైన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. వీటిని పదో తరగతి స్థాయిలోనే ఇస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. పరీక్ష తేదీ వివరాలు తర్వాత ప్రకటిస్తారు. అర్హత సాధించినవారి వివరాలు ఆర్మీ వెబ్సైట్ లో ఉంచుతారు. సైన్యంలో పనిచేసినవారి పిల్లలకు, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికి, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఆదనంగా కొన్ని బోనస్మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు వీటిని కలుపుతారు 

ఫిట్ నెస్ టెస్టు:

1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. పది అడుగుల దూరానికి లాంగ్ జంప్,మూడు అడుగుల ఎత్తుకు హైజంప్ చేయగలగాలి.

శిక్షణ, వేతనం

ఎంపికైనవారికి సంబంధిత కేంద్రంలో 33 వారాలపాటు శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నవారిని సిపాయ్హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి పురుష మిలటరీ పోలీస్లతో సమానంగా వేతనం, ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు దక్కుతాయి. శిక్షణ అనంతరం రూ.21,700 మూలవేతనం అందుతుంది. దీనికి అదనంగా గ్రేడ్ పే,డీఏ, హెమోగ్లే... మొదలైనవి ఉంటాయి. అంటే వీధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. 15 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగినవారు పెన్షన్ కు అర్హత సాధిస్తారు.

ఎవరు అర్హులు?

పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ (విమెన్ మిలిటరీ పోలీస్)

ఖాళీలు: 100

అర్హత: పదో తరగతిలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం తప్పనిసరి. అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు.

వయసు: 11 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబరు 1,2000 తర్వాత, ఏప్రిల్ 1, 2004 కంటే ముందు జన్మించాలి.

ఎత్తు: కనీసం 152 సెం.మీ. ఉండాలి. అందుకు తగ్గ బరువు తప్పనిసరి.

ఆన్‌లైన్ దరఖాస్తులు: జులై 20 వరకు స్వీకరిస్తారు.

వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH6UH8wzmRQIV40nXHXsrQ

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top