సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్‌ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్‌ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయోపరిమితి: 

అభ్యర్ధులు 15 నుంచి 24 ఏళ్లు మించకూడదు. SC, ST అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత: 

అభ్యర్ధులు పదోతరగతి 50శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 11, 2019.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 8, 2019

విభాగాల వారీగా ఖాళీలు: 

ఫిట్టర్ - 1460, ఎలక్ట్రీషియన్ - 871, డీజిల్ మెకానిక్ - 640, వెల్డర్ - 597, ఏసీ మెకానిక్ - 249, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 102, మెకానిస్ట్ - 74, పెయింటర్ - 40, ఎంఎండబ్ల్యూ - 34, ఎలక్ట్రికల్ - 18, కార్పెంటర్ - 16, ఎంఎంటీఎం - 12

దరఖాస్తు ఫీజు: 

జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళలకు ఎటాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ONLINE APPLICATION               Compelete Notification 
Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top