Gramasachivalyam Jobs Hall Tckets

AP Grama Sachivalayam Hall Ticket 2019  గ్రామ/వార్డ్ సచివాలయం హాల్టికెట్స్  డౌన్లోడ్ ప్రారంభం.

Steps to Download Hall Tickets: హాల్ టికెట్స్ ఈ క్రింద విదముగా డౌన్లోడ్ చేసుకోవాలి 


  1. One Time Registration and Date of Birth
  2. Application ID and Date of Birht
  3. Aadhar Number and Date of Birth
పైన తెలిపిన వివరాలు నమోదు చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి 

 గ్రామ సచివాలయాలు


★ గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహణ.

★ సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పరీక్ష నిర్వహించడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

★ అభ్యర్థుల తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

★ సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహణ.

★ ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్క్‌లు ఉంటాయి. అన్ని పోస్టులకు 150 మార్కులకే పరీక్షలు నిర్వహణ.

★ కేటగిరీ 1లో ఉన్న పోస్టులకు పార్టు(ఏ) 75 మార్కులు, పార్టు(బీ) 75 మార్కులకు ఉంటాయి.

★ మిగతా అన్ని పోస్టులకు పార్టు(ఏ) 50, పార్టు(బీ) 100 మార్కులకు జరుగుతుంది.

★ ప్రతీ నాలుగు తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్క్‌ వేస్తారు.

స‌చివాల‌య రాత పరీక్షలు - అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


★ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

★ పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

★ మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.

★ అభ్యర్థులు హాల్‌టికెట్‌‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి.

★ ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.

★ ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్‌లో జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు.

★ దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.

★ ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు.

★ కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.

★ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.

★ నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచన.

       
Download  Hall Tickets
Posted in: ,

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top