Railway Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. భారీగా రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్‌న్యూస్ చెప్పింది. సౌత్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. ట్రైనీ ఉద్యోగిగా చేరి ఏడాది కాలం స్టైఫండ్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. హుబ్బళ్లిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే, మొత్తం 904 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు హుబ్బళ్లి RRC అధికారిక వెబ్‌సైట్ rrchubli.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జులై 3న ప్రారంభమైన అప్లికేషన్ ప్రాసెస్, ఆగస్టు 2న ముగియనుంది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఇతర వివరాలు తెలుసుకుందాం.
విద్యార్హత, వయసు అభ్యర్థులు 

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల్లో (లేదా వాటికి సమానమైన ఎగ్జామ్స్‌) కనీసం 50% మొత్తం మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ (షెడ్యూల్డ్ కులం), ఎస్టీ (షెడ్యూల్డ్ తెగ), ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు), దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థులను మెరిట్ లిస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెట్రిక్యులేషన్‌, ITI పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. ఇందులో టాప్‌లో ఉన్న వారికి అప్రెంటిస్ పోస్టులకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

ఖాళీ వివరాలు

హుబ్బళ్లి డివిజన్‌లో 237 పోస్టులు, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (హుబ్బల్లి)లో 217 పోస్టులు, బెంగళూరు డివిజన్‌లో 230 పోస్టులు, మైసూరు డివిజన్‌లో 177 పోస్టులు, సెంట్రల్ వర్క్‌షాప్ (మైసూరు) 43 పోస్టులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

అప్లికేషన్ ఫీజు

జనరల్, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. దీనిని డెబిట్ కార్డ్ , క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ పద్ధతులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించాలి. SC, ST, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

ట్రైనింగ్ పీరియడ్

రైల్వే బోర్డు నియమాలు, ఆదేశాల ప్రకారం అన్ని ట్రేడ్‌లకు శిక్షణా కాలం ఒక సంవత్సరం ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో ఎలాంటి హాస్టల్ వసతి లభించదు. ఈ పోస్టులకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే, అభ్యర్థులు swractapp2223@gmail.com మెయిల్ ద్వారా బోర్డుని సంప్రదించవచ్చు.

అప్లికేషన్ ప్రాసెస్

- RRC హుబ్బల్లి అధికారిక వెబ్‌సైట్ rrchubli.in కి వెళ్లాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘రిజిస్ట్రేషన్’ లింక్‌పై క్లిక్ చేయాలి.

- కొత్త యూజర్లు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత పర్సనల్, ఎడ్యుకేషనల్, ఇతర వివరాలతో అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేయాలి.

- అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

- భవిష్యత్తు అవసరాల కోసం సబ్మిట్ చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.


Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top