UPSC CDS Notification: సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (II) - 2023 నోటిఫికేషన్ విడుదల - త్రివిధ దళాల్లో 349 ఖాళీలు

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

పోస్టుల వివ‌రాలు...

* కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్‌) ఎగ్జామినేష‌న్ (II)-2023

ఖాళీల సంఖ్య: 349

అకాడమీల వారీగా ఖాళీలు..

➥ ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, డెహ్రాడూన్: 100

➥ ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ల‌: 32

➥ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్: 32

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై: 169

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై: 16

అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. నేవల్ అకాడమీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టుల భర్తీకి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ‌మెటిక్స్ స‌బ్జెక్టుల‌ు చదివి ఉండాలి. 

వయోపరిమితి..

➥ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీకి 02.07.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥  ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 01.07.2024 నాటికి  20-24 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.2000 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. 

➥ డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 02.07.1998 -01.07. 2004 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక‌ విధానం: రాత ప‌రీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు.  ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు, మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. వీరికి 200 మార్కులకే రాతపరీక్ష ఉంటుంది.  

ఇంటర్వ్యూ విధానం: ఈ విభాగానికి 300 మార్కులుంటాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ) పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులకు ఉంటుంది.  ఇంటర్వ్యూ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2023.

➥ నేరుగా ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.06.2023.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.06.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2023. (6:00 PM)

➥ దరఖాస్తుల ఉపసంహరణ: 07.06.2023 - 13.06.2023.

➥ ఆన్‌లైన్ రాత పరీక్ష: 16.04.2023.

➥ ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: 2023, ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో.

➥ కోర్సులు ప్రారంభం: 02.01.2024.

Download Complete Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top