IDBI: ఐడీబీఐ బ్యాంక్ లో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్లు

IDBI: ఐడీబీఐ బ్యాంక్ లో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

IDBI BANK

* 'స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.

* మొత్తం ఖాళీలు: 136

1) గ్రేడ్ బి - మేనేజర్లు: 84

2) గ్రేడ్ సి అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు: 46

3) గ్రేడ్ డి - డిప్యూటీ జనరల్ మేనేజర్లు: 06

విభాగాలు: ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లీగల్ రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ, కార్పొరేట్ క్రెడిట్, సెక్యూరిటీ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ / బీఈ/ బీటెక్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ/ పీహెచ్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.48170-రూ.76010 చెల్లిస్తారు. ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు.

* షార్టిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023. దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023.

Job Notification Whatsapp Group:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top