AP Grama Sachivalayam : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,523 ఉద్యోగ ఖాళీలు.. విభాగాల వారీగా ఖాళీలివే..!

IBPS Exam Calendar 2023 : ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే ఉద్యోగార్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2023-2024 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్‌తో పాటు గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఖాళీల భర్తీకి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. ఆర్‌ఆర్‌బీ- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌-1, 2, 3 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జరుగనున్నాయి. పీఎస్‌బీ- క్లర్క్‌, పీవో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు వివిధ తేదీల్లో నిర్వహించనున్నారు.ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రకటనలో తెలిపిన విధంగా అభ్యర్థులు ఫొటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర, డిక్లరేషన్ వివరాలను అప్‌లోడ్ చేయాలి. పరీక్ష తేదీలకు ముందే ఉద్యోగ ప్రకటన విడుదలవుతుంది కాబట్టి పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అనుసరిస్తూ ఉండాలని IBPS స్పష్టం చేసింది.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top