టెన్త్ ప్యాస్ అయినవారికి గుడ్ న్యూస్. సెంట్రల్‌ రైల్వేలో 2,422 ఉద్యోగాలు..

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ రైల్వే లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.ముంబాయి, భుసావల్, పూణె, నాగ్‌పూర్‌, సోలాపూర్‌ క్లస్టర్‌లలో ఈ ఖాళీలు వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 2,422 అప్రెంటిస్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి.
పోస్టుల వివరాలని చూస్తే.. ఫిట్టర్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, పెయింటర్, టైలర్‌ పోస్టులు వున్నాయి. అలానే ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్, వెల్డర్‌, మెకానిక్‌ డీజిల్‌, టర్నర్‌ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే టెన్త్ క్లాస్ ప్యాస్ అయ్యి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.అలానే నేషనల్ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కూడా తప్పక ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. డిసెంబర్‌ 15, 2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి జనవరి 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం వుంది. అప్లికేషన్ ఫీజు వివరాలను చూస్తే.. జనరల్‌ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు గా చెల్లించాలి.

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు ఫీజు లేదు. అర్హత సాధించిన వారికి మొదటి ఏడాది రూ.7000లు స్టైపెండ్‌ ఇస్తారు. రెండో ఏడాది 10 శాతం, మూడో ఏడాది 15 శాతం ఎక్కువ స్టైపెండ్‌ వస్తుంది. https://www.rrccr.com/Home/Home లో పూర్తి వివరాలను చూసి అప్లై చేసుకోవచ్చు.

జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Km4TfAMjm7DGFZIDkWp8lW


Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top