DRDO భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌.. 1061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు అర్హులు

DRDO CEPTAM 10 Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో ఎంట్రన్స్‌ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్‌-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 7 నుంచి ప్రారంభమైంది.
మొత్తం ఖాళీలు: 1061

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 12 పోస్టులు
స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు
స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 04 పోస్టులు
సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు
వెహికల్ ఆపరేటర్ ‘ఎ’: 145 పోస్టులు
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’: 18 పోస్టులు
ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు

ముఖ్య సమాచారం:

అర్హతలు: పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్‌, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండి.. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35400-రూ.112400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25500-రూ.81100, ఇతర పోస్టులకు రూ.19900- రూ.63200 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1 (సీబీటీ), టైర్-2 (నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: నవంబర్‌ 7, 2022
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 7, 2022

నోటిఫికేషన్: Click Here

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/ceptm-advertisement/1782
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top