Women's Constables: గుడ్ న్యూస్.. 2626 మహిళా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారుమొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తుల చేసుకోవాలంటే.. అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌(CARP), సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF), రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) ఈ నోటిఫికేషన్‌ను(Notification) విడుదల చేసింది. 
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష(CBT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్(PST), మెడికల్ పరీక్షలు(Medical Tests), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Documentation Verification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు.పోస్టుల వివరాలిలా..

బీఎస్ఎఫ్(BSF) 10,497. పురుషులు 8922, స్త్రీలు 1575 

సీఐఎస్ఎఫ్(CISF) 100. పురుషులు 90, స్త్రీలు 10 

సీఆర్పీఎఫ్(CRPF) 8911. పురుషులు 8380, స్త్రీలు 531 

ఎస్ఎస్బీ(SSB) 1284. పురుషులు 1041, స్త్రీలు 243 

ఐటీబీపీ(ITBP) 1613. పురుషులు 1371, స్త్రీలు 242. 

ఏఆర్(AR) 1697.ఇవి కేవలం పురుషులు కు మాత్రమే కేటాయించారు. 

ఎస్ఎస్ ఎఫ్(SSF) 103. పురుషులు 78, స్త్రీలు 25. ఎన్సీబీ(NCB) 164. వీటిని కేవలం పురుషులకు మాత్రమే కేటాయించారు. 

మొత్తం (Total) 24,369. పురుషులు 21579. స్త్రీలు 2626. 

మొత్తం 24,369 పోస్టుల్లో మహిళలలకు 2626 పోస్టులను కేటాయించారు. అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు. మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు. 

విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దీనిలో ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు వయో పరిమితలో సడలింపు ఇవ్వనున్నారు. అభ్యర్థులు జనవరి 02, 2000 నుంచి జనవరి 01, 2005 మధ్య జన్మించి ఉండాలి. వీటితో పాటు.. ఎక్స్-సర్వీస్‌మెన్-3 సంవత్సరాలు, అల్లర్లలో భాదిత కుటంబాలకు చెందిన అభ్యర్థులకు 5 - 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్ష ఫీజు.. పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. 

జీతం.. ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది. 
ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.10.2022

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022 (23:00)

* చలానా జనరేట్ చేయడానికి చివరితేది: 30.11.2022 (23:00)

* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.12.2022 (23:00)

* చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.12.2022.

* సీబీటీ పరీక్ష తేదీ: 2023 జనవరిలో.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top