AP High Court Recruitment 2022 | ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీనిలో ఆఫీస్ సబార్డినేట్  (Office Subordinate) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో(District Courts) ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి.  1. అనంతపురం-92 2.చిత్తూరు- 168 3.తూర్పు గోదావరి -156 4.గుంటూరు - 147 5.వైఎస్ఆర్ కడప-83 6. కృష్ణ - 204 7.కర్నూలు - 91 8. నెల్లూరు - 104 9.ప్రకాశం - 98 10. శ్రీకాకులం - 87 11.విశాఖపట్నం - 125 12.విజయనగరం - 57 13. పశ్చిమగోదావరి - 108 

మొత్తం - 1520

ముఖ్యమైన తేదీలు.. -దరఖాస్తులు ప్రారంభ తేదీ 22-10-2022 -దరఖాస్తులకు చివరి తేదీ 11-11-2022 అర్హతలు అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అనంతపురం వాసులకు తెలుగు, కన్నడ భాష వచ్చి ఉండాలి. శ్రీకాకులం, విజయనగం జిల్లా అభ్యర్థులకు తెలుగు, ఒరియా వచ్చి ఉండాలి. దీంతో పాటు.. అభ్యర్థులు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఎంపిక ఇలా.. అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు.. మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు తదుపరి దశకు పిలుస్తారు. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు సాధిస్తే చాలు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ఇలా.. -ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. -దీనిలో నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అర్హతలను చెక్ చేసుకోవాలి. -వాటికి అర్హులుగా ఉంటే.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. -వెబ్ సైట్ లో అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ ను ఎంచుకొని వివరాలను నమోదు చేయాలి. -చివరగా దరఖాస్తు చేసుకున్న ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి.

దరఖాస్తుల సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే.. 0863-2372752 నంబర్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఐడీ helpdesk-hc.ap@aij.gov.in కూడా సంప్రదించవచ్చు

ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి...


Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top