BSF: 1635 హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్, ఇంటర్ అర్హత.. రూ.92,300 వరకూ జీతం

BSF Recruitment 2022: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం (BSF) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1635

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(స్టెనోగ్రాఫర్)- 11 • హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్ - 312

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)- 982

హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)- 330

ముఖ్య సమాచారం:
అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(10+2), ఇంగ్లిష్/ హిందీ షార్ట్ హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.29,200 - 92,300 (ఏఎస్ఐ), రూ.25,500 - 81,100( హెచ్సీ) ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సెప్టెంబర్ 06 చివరితేదీ కాగా.. రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ పోస్టులకు ఆగస్టు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై.. సెప్టెంబర్ 28న ముగుస్తుంది.

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://rectt.bsf.gov.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top