PMNAM 2022: విద్యార్థులకు సూపర్‌ ఛాన్స్‌.. కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్‌ మేళా.. 1000కి పైగా కంపెనీలు హాజరు.. రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఇదే

PM National Apprenticeship Mela PMNAM 2022: యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్‌ మేళాను నిర్వహిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు.. కార్పొరేట్‌ సంస్థల్లో ఆన్‌గ్రౌండ్‌ ట్రైనింగ్ కోసం యువతను అనుసంధానం చేయడం.. మరింత యువతను చేరువ చేయాలనే లక్ష్యంతో.. ఇక నుంచి ప్రతి నెలా అప్రెంటిస్‌షిప్ మేళా (DGT Apprentice Mela) నిర్వహించనుంది.దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ అప్రెంటిస్‌ మేళా జులై 11న ప్రారంభమైంది. 1000కి పైగా కంపెనీలు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొంటాయి. పూర్తి వివరాలను, రాష్ట్రాల వారీగా అప్రెంటిస్‌ మేళాలు జరిగే తేదీలను ఈ లింక్‌ క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.PMNAM 2022 కి ఎవరు అప్లయ్‌ చేసుకోవచ్చంటే..?
అప్రెంటిస్‌ విభాగాన్ని బట్టి 5వ తరగతి, 12వ తరగతి పాస్ సర్టిఫికేట్, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ITI డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ మేళాలో పాల్గొనే వారు.. వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, హౌస్ కీపర్లు, బ్యూటీషియన్లు, మెకానిక్‌లతో సహా 500కి పైగా వివిధ ట్రేడ్‌లను ఎంచుకోవచ్చు.

PMNAM 2022 అప్రెంటిస్‌షిప్ మేళా ప్రయోజనాలివే:
శిక్షణ ముగిసిన తర్వాత అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) నుంచి అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్‌ అందుకుంటారు. తద్వారా సదరు అభ్యర్థులకు పరిశ్రమ గుర్తింపు లభిస్తుంది. PM నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనే సంస్థలు అక్కడికక్కడే అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు షేర్డ్ ప్లాట్‌ఫారమ్‌లో పొటెన్షియల్ అప్రెంటిస్‌లను కలిసే అవకాశం ఉంటుంది.

Registration Link:
 https://dgt.gov.in/appmela2022/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top