Infantry School Jobs 2022: నెలకు రూ.81,100ల జీతంతో.. ఇండియన్‌ ఆర్మీ ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో101 గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు..

ఇండియన్ ఆర్మీకి చెందిన మధ్యప్రదేశ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం (Infantry School HQ).. గ్రూప్‌ - సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Indian Army Infantry School Group C Recruitment 2022 : ఇండియన్ ఆర్మీకి చెందిన మధ్యప్రదేశ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం (Infantry School HQ).. గ్రూప్‌ – సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:మొత్తం పోస్టుల సంఖ్య: 101

పోస్టుల వివరాలు: డ్రాఫ్ట్స్‌మెన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, స్టెనోగ్రాఫర్‌, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌, కుక్‌, ట్రాన్స్‌లేటర్, బార్బర్‌, ఆర్టిస్ట్‌/ మోడల్‌ మేకర్‌ పోస్టులు.

ఖాళీల వివరాలు:

ఇన్‌ఫ్రాంట్రీ స్కూల్‌, మౌ స్టేషన్‌ పోస్టులు: 65
ఇన్‌ఫాంట్రీ స్కూల్‌, బెల్గాం (కర్ణాటక) పోస్టులు: 36
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.19,900ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి, ఇంటర్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్ట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకుగానూ 2 గంటల సమయంలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది.

జనరల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు
జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు రుసుము: రూ.50

అడ్రస్‌: ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, అప్లికేషన్‌ స్కృటినీ బోర్డు, ది ఇన్‌ఫాంట్రీ స్కూల్‌, మౌ, మధ్యప్రదేశ్‌-453441.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 25, 2022.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి


Official Website: Click Here
Complete Notification: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top