IBPS RRB Recruitment 2022 | రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి అలర్ట్. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ వెల్లడించింది.ఆర్‌ఆర్‌బీల్లో గ్రూప్ A ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు IBPS తెలిపింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 43 RRBలలో మొత్తం ఖాళీల సంఖ్యను 8106 నుంచి 8285కి పెంచింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 27. ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-I, ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్), ఆఫీసర్ స్కేల్-III పోస్టులకు ఖాళీల సంఖ్యను ఐబీపీఎస్ పెంచింది.
RRB రిక్రూట్‌మెంట్ అర్హతలు
అభ్యర్థులందరూ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టుకు అభ్యర్థి వయసు 21 ఏళ్లు పైబడి ఉండాలి, 40 ఏళ్లు మించకూడదు. ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టుకు అభ్యర్థి కనీస వయసు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుకు అభ్యర్థి వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అభ్యర్థి వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ
స్టెప్ 1: IBPS అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో, "CRP for RRBs" లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలో ఎంచుకోండి.
స్టెప్ 4: అవసరమైన వివరాలను నింపి రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 5: అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేసి, ప్రింటవుట్‌ను తీసుకోండి.
అప్లికేషన్ ఫీజు
ఆఫీసర్ (స్కేల్ I, II & III) పోస్టులకు దరఖాస్తు చేసుకునే SC, ST, PWBD కేటగిరీల అభ్యర్థులు రూ. 175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 850 చెల్లించాలి. అయితే ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు.. SC, ST, PWBD, EXSM కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175, మిగతా వారికి రూ. 850.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఈ రౌండ్‌ను క్లియర్ చేసిన వారిని ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఆఫీసర్ స్కేల్-I పోస్ట్ కోసం రీజినల్ రూరల్ బ్యాంకులు కొన్ని సెంటర్లలో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఏర్పాటు చేయవచ్చు. షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు/ మైనారిటీ కమ్యూనిటీలు/ మాజీ సైనికులు/ బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు పరిమిత సంఖ్యలో ఈ ట్రైనింగ్ ఇస్తారు.
IBPS RRB 2022 ఎగ్జామ్ క్యాలెండర్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు
అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు (ఆన్‌లైన్)- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్- 9 జూలై 2022
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్- 18 జూలై 2022
ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- జూలై/ఆగస్టు 2022
ప్రిలిమ్స్ ఎగ్జామ్- ఆగస్టు 2022
ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు- సెప్టెంబర్ 2022
మెయిన్స్/సింగిల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- సెప్టెంబర్ 2022
మెయిన్/సింగిల్ ఎగ్జామ్- సెప్టెంబర్ 2022
మెయిన్/సింగిల్ ఎగ్జామ్ రిజల్ట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్ 2022
ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022
ఇంటర్వ్యూ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III & ఆఫీసర్ అసిస్టెంట్ (మల్టీపర్పస్))- జనవరి 2023.
Official Website: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top