Hyderabad Police Job Mela | హైదరాబాదులో పోలీసు శాఖ వారు భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా..సమాజ సేవలోనూ ఉందు ఉంటారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో సిటీ పోలీసులు (City Police) తీసుకునే చొరవ అనేక సార్లు అభినందలు అందుకుంది. పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు పోలీసుల ఆధ్వర్యంలో అనేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాల్లో ఫ్రీగా కోచింగ్ (Jobs Coaching) అందిస్తూ వారు ఉద్యోగం సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన అనేక మంది యువతీ యువకులు ఈ శిక్షణ శిబిరాల్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంకా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళా (Job Mela) లను సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాబ్ మేళాల ద్వారా ప్రవేట్ కంపెనీల్లో వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది తెలంగాణ పోలీస్. తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్(Axis Bank) , ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), ఎయిర్టెల్ (Airtel) తో పాటు అనేక ప్రముఖ సంస్థలో పాల్గొని మొత్తం 1500లకు పైగా యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న నిర్వహించనున్న జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.
జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు..

ఈ జాబ్ మేళాలో TMI Group, Axis Bank, ICICI Bank, Big Basket, Vijaya Diagnostic Center, Apollo Pharmacies Ltd, Airtel తో పాటు మొత్తం 15 కంపెనీలు పాల్గొననున్నాయి.

రిజిస్ట్రేషన్ ఇలా..
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ (bit.ly/jcepass) ను ఓపెన్ చేయాలి.
-అనంతరం అప్లికేషన్ ఫామ్ (Job Application Form) ఓపెన్ అవుతుంది.
-ఆ ఫామ్ లో పేరు, వయస్సు, ఫోన్ నంబర్, చిరునామా, ఈమెయిల్ ఐడీ, విద్యార్హతల వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

జాబ్ మేళా నిర్వహించు చిరునామా:
రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29 (బుధవారం) ఉదయం 9 గంటలకు Heritage Palace, 1-47-908/7, Musheerabad Main Rd, Musheerabad, Kavadiguda, Hyderabad-500020 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top